తమిళ స్టార్ హీరో విజయ్ తన భార్య సంగీత, కుమార్తె దివ్య సాషాలతో కలిసి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న తన నివాసంలో ఉంటున్నాడు. విజయ్ కుమారుడు జాన్సన్ కెనడాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఫిల్మ్‌మేకింగ్ కోర్స్ అభ్యసిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా జాన్సన్ కెనాడలోనే చిక్కుకుపోయాడు. అయితే ప్రస్తుత పరిస్థితులు భయంకరంగా మారుతున్న వేళ విజయ్ కుమారుడి విషయంలో ఆందోళన చెందుతున్నాడట.
కరోనా చాలా దేశాలలో చాప కింద నీరులా విస్తరిస్తుంది. కాస్త అజాగ్రత్తగా ఉంటే దానికి బలి కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తన కొడుకు క్షేమం గురించిన విజయ్ ప్రతి రోజు జాన్సన్‌కి ఫోన్ చేసి సలహాలు, సూచనలు చేశారట. అత్యవసర పరిస్థితులలో బయటకి రావొద్దని హితవు పలికారట. సంజయ్ ఆ మధ్య ఓ షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే