కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రజలలో మరింత అవగాహన కల్పించేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పాటలు పాడి చెబుతుండగా, మరి కొందరు డ్యాన్స్‌లు చేసి చూపిస్తున్నారు. ఇంకొందరు స్టార్ హీరోల పోస్టర్స్‌తో అభిమానులకి అవగాహన కల్పించేలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా పుణె పోలీసులు కరోనాపై అవగాహన కల్పించేందుకు కొత్త ప్రయోగం చేశారు. గజిని సినిమాలో అమీర్ ఖాన్ పోస్టర్‌ని తీసుకొని అందులో హీరో ముఖానికి మాస్క్ తగిలించారు. ఆ ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఏవైన మరచిపోండి కాని, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం, సామాజిక మాధ్యమం పాటించడం, తరచు చేతులు కడుక్కోవడం మరచిపోవొద్దని పేర్కొన్నారు . వీటి కోసం మీరు మీ శరీరమంతా పచ్చబొట్టు పొడిపించుకోవలసిన అవసరం లేదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు పూణే పోలీసులు. వీరి ప్రయత్నాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు.