కరోనా వైరస్ (కోవిడ్-19)వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్రపౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 అర్థరాత్రి నుంచి దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది. సరకు రవాణా విమానాలు తప్ప అన్ని సర్వీసులు రద్దు చేసిననట్లు విమానయాన శాఖ వెల్లడించింది. విమానయాన సంస్థలు తమ విమానాలు మంగళవారం అర్తరాత్రిలోగా గమ్యస్థానాలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచనలు చేసింది. విమానయాన శాఖ ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలు బంద్..