‘మూడు నెలల క్రితం ఈ సినిమా చూశాను. ఎక్కడో చిన్న అసంతృప్తి అనిపించింది. అదే విషయాన్ని దర్శకులకు చెప్పాను. కొన్ని మార్పులతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ మధ్యే మొత్తం సినిమా చూశాను. అద్భుతంగా ఉంది’ అన్నారు ప్రముఖ దర్శకుడు క్రిష్. ఆయన ఓ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘ప్రెజర్ కుక్కర్' చిత్ర ప్రీరిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సాయిరోనక్, ప్రీతిఅస్రాని జంటగా నటించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. సుశీల్‌సుభాస్ కారంపురి, అప్పిరెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ చిత్ర బిగ్‌సీడీని యువహీరో విశ్వక్‌సేన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘నా స్నేహితులు అమెరికా వెళ్లిపోతుంటే బాధగా అనిపిస్తుంది. మా బృందంలో సగం మంది వెళ్లిపోగా, సగం మంది ఇక్కడ మిగిలిపోయాం. ఈ ఇష్యూపై తీసిన సినిమా ఇది. తప్పకుండా కొత్తదనంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘ఈ సినిమా విషయంలో దర్శకుడు క్రిష్ ఎంతో సహాయం చేశారు. ‘నేను మీకు సహాయం చేస్తున్నాం. మీరు రేపు మరొకరికి సహాయం చేయాలి’ అని చెప్పారాయన.